Logo
Date of Publish : 09 April 2022, 11:28 am
Editor : Sake Naresh

జయలక్ష్మీ కో ఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్లకు న్యాయం చేయాలి : జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

    కాకినాడ, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ‘ది జయలక్ష్మి కో ఆపరేటివ్ ఎమ్.ఎ.ఎమ్. సొసైటీ’లో డిపాజిట్లు చేసి మోసపోయినవారికి ప్రభుత్వం న్యాయం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో కోరారు. 20 వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.520 కోట్ల మేర సేకరించిన సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసిన తీరు అనేక సందేహాలు కలిగిస్తోంది. రాజకీయ పలుకుబడితోనే యాజమాన్యం ఇలాంటి సాహసానికి పాల్పడినట్టు సమాచారం ఉంది. బాధ్యుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పరారీలో ఉన్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. ఈ సంస్థ ఆర్ధిక లావాదేవీలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. వీరి వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించరాదు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ వారు అధిక వడ్డీ ఆశ చూపడం వల్లే ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ సంస్థలో ఎక్కువ శాతం విశ్రాంత ఉద్యోగులే తమ పెన్షన్ బెనిఫిట్స్ డిపాజిట్ చేశారు. అలాగే పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం అక్కరకు వస్తాయని నమ్మిన వారిని ఆ సంస్థ నట్టేట ముంచింది. డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ. 520 కోట్లు దారిమళ్లినట్టు తెలుస్తోంది. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాటం చేస్తుంది. అగ్రిగోల్డ్ లాంటి సంస్థల బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com