
అనంతపురం ( జనస్వరం ) : జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజు సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ లో ఆయన విగ్రహానికి భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు గాండ్ల జయంత్ వర్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, మన దేశ మొట్ట మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి జరుపుకోవడం చాలా సంతోషం గా వుందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారి మాటలు గుర్తు చేస్తూ ” నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు. వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పని చేద్దాం అని చెప్పారు. నెహ్రూ గారి సిద్దాంతాలు, ఆశయాలు ఎప్పటికీ ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు . ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రవి చంద్ర, వంశీ కృష్ణ తదితర విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.