Search
Close this search box.
Search
Close this search box.

జనవరి కూడా అయిపోయింది.. జాబ్ క్యాలెండర్ ఎక్కడ : దోమకొండ అశోక్

దోమకొండ అశోక్

               విజయవాడ, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది నిరుద్యోగ యువత వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని జనసేన పార్టీ యువ నాయకులు దోమకొండ అశోక్ అన్నారు. నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తుందన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో అంత మెజారిటీ చట్టసభల్లో దక్కడంలో ఆ 30 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రధాన కారణమయ్యారన్నారు. ఎన్నికలకు ముందు 2లక్షల 30వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు పట్టు బట్టలు, బంగారం కాదు, మంచి భవిషత్తు ఇవ్వండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించండి చాలు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం లో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తుందన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా, నాలుగు జనవరిలు గడిచిన ఒక్కటైన నిరుద్యోగులకు ఉపయోగపడే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసిందా? డిగ్రీలు , ఎం.బీ.ఏ.లు పి.జీ.లు చేసిన యువత నోటిఫికేషన్ కోసం ఎదురుచూడటంలోనే పుణ్యకాలం పూర్తయిపోతుందన్నారు. స్వతంత్ర భారతంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తమదే అని ప్రగల్భాలు పలికిన వై.సి.పి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త జోష్యం చెబుతూ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తమ ఖాతాలోనే వేసుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ వై.సీ.పీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో భారీగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని తెలిపారు. 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ భారీగా ప్రకటన చేసిందన్నారు. తీరా వాస్తవంలోకి వస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితికి వచ్చిందన్నారు. ఇక స్వచ్ఛందసేవా కార్యక్రమం అని ప్రవేశపెట్టిన వాలంటర్ ఉద్యోగులకు నెలకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం కూడా చెల్లించలేక సేవా కార్యక్రమం పేరుతో తమ పార్టీ కార్యక్రమాలకు బానిసలు చేసిందన్నారు. అర్హతకు తగిన ఉద్యోగం లేక స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్నా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్జీలకు సబ్సిడీ రుణాలు లేకుండా చేసిందన్నారు. నిరుద్యోగుల ని కేవలం ఓటు బ్యాంకు లాగా మాత్రమే చూసే వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన తొందర్లోనే తిప్పి కొడుతుంది. ఉద్యోగాలు వస్తాయని యువత ఢిల్లీకి వెళ్ళి , హైదరాబాద్ వెళ్ళి . అవనిగడ్డ వెళ్ళి … వేరే నగరాలకు వెళ్ళి కోచింగ్ తీసుకొంటున్నారు . వారందరి పరిస్థితి ఏమిటి ? అని నిరుద్యోగ యువత తమ ఆవేదనను తెలియచేస్తున్నారన్నారు. తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు, కొత్తకొత్త పదవులు సృష్టించి ఉపాధి కల్పించిన వైసీపీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడం లేదు.. తమ పార్టీ వారిపై ఉన్న శ్రద్ధ, హామీ ఇచ్చిన 2.3 లక్షల ఉద్యోగాలపై ఎందుకు లేదని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి నిరుద్యోగ యువతకి జాబ్ కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువతకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెన్ను దన్నుగా నిలుస్తారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భవించింది యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికే అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way