Search
Close this search box.
Search
Close this search box.

సమస్యల పరిష్కారానికి జనవాణి : అనంతపురం జిల్లా అధ్యక్షులు TC వరుణ్

● ప్రజా విశ్వాసం కోల్పోతున్న వైసిపి –  జనసేన వైపు రాష్ట్రం చూపు

● సమస్యల పరిష్కారానికి జనవాణి

● 21న తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్న జనవాణి కార్యక్రమము

●తమ పడుతున్న కష్టాలను, సమస్యలను చెప్పుకోవడానికి బాధిత ప్రజలు తరలిరానున్నారు

●పాత్రికేయుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు  టి.సి.వరుణ్ 

      అనంతపురం, (జనస్వరం) : ఎన్నికల సమయంలో అలవి గాని హమీలిచ్చి వాటిని అమలు చేయలేక, అభివృద్ధిని విస్మరించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. నీతి నిజాయితీ నిబద్ధత.. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కలిగిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన వైపు చూస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్  అన్నారు. శుక్రవారం అనంతపురం సప్తగిరి సర్కిల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. నవరత్నాల పేరిట ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల ఆంధ్రులకు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలలో తీసుకురాలేక, ఉపాధి అవకాశాలు కల్పించలేక, వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయలేక, ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల హామీని నెరవేర్చలేక వైసిపి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనే కుట్టిల యత్నాలకు పవన్ కళ్యాణ్ చరమగీతం పాడుతుండడం చూసి ఓర్వలేక జనసేన పై వైసీపీ ప్రజా ప్రతినిధులు అక్కస్సు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు సొంత నిధులను వ్యయం చేసి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంటే.. తన సొంత నియోజకవర్గంలోని కౌలు రైతులకు కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే సామర్థ్యం లేక రాష్ట్ర ప్రజల నెత్తిన చెయ్యి పెడుతూ అప్పులు తెచ్చి బటన్ నొక్కుతుంటే.. పసిగట్టిన ప్రజలు వైసిపి ఎమ్మెల్యేల చొక్కాలను పట్టుకుంటున్నారన్నారు. ఈనెల 21న తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమానికి రాష్ట్ర నలమూలాల నుంచి వేలాదిగా కష్టాలను తమ సమస్యలను చెప్పుకోవడానికి బాధిత ప్రజలు తరలి రానున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఖబడ్దార్ వైసిపి నేతలూ ఖబడ్దార్.. మీకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని టి.సి.వరుణ్ ఘాటుగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి రాప ధనుంజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి నెట్టిగంటి హరీష్, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way