Logo
Date of Publish : 07 August 2023, 9:12 pm
Editor : Sake Naresh

లోకం మాధవి ఆధ్వర్యంలో మన ఊరిలో జనవాణి కార్యక్రమం

         నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట పంచాయతీలో, మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి గారు ప్రతిగడపకి పర్యటించి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ జోగిరాజుపేట గ్రామంలో అధిక శాతం మంది రైతులు ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతులని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదు అని, అలాగే కూలీలను కూడా విస్మరిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ తప్పించి మిగతా ఎక్కడా పనులు దొరకట్లేదని, ఇలా అయితే కూలీ చేసుకుని కుటుంబం గడిపే వాళ్ల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే మహిళలకి యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి అంటే మన నెల్లిమర్ల నియోజకవర్గం లోకి పరిశ్రమలు రావాలి అని, పరిశ్రమలు అంటే కాలుష్యాన్ని చిన్ని ఎవరికో ఇచ్చే ఉద్యోగాలు కాదని, మన రైతులు పండించిన పంటకి వాటి అనుసంధానంగా పరిశ్రమలు పెట్టి, వాటిలో మన నియోజకవర్గంలోని అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఒక విద్యావంతురాలునని దేశ విదేశాలు తిరిగి అక్కడ పరిస్థితులు అన్నీ ఆకలింపు చేసుకొని మన ప్రాంతంలో ఏదో చేయాలని తపనతో రాజకీయాల్లోకి రావడం మాధవి గారు చెప్పారు. తనది అవినీతి సొమ్ము కాదని కష్టపడి తన కష్టార్జితంతో సంపాదించిన ధనం అని, ఎంతోమందికి విద్య ఉద్యోగ అవకాశాలు ఈ 30 ఏళ్లలో కల్పించానని తెలియచేశారు.పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం భావజాలం నచ్చే రాజకీయాల్లోకివచ్చి జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. వైసిపి పార్టీని గత ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించారని, సంక్షేమం సంక్షేమం తప్పించి అభివృద్ధిని కుంటున పడేశారని మాధవి గారి తెలిపారు. ఆ సంక్షేమం కూడా ఉన్న వారికే ఇస్తున్నారని పేదవాడి చేతికి అందట్లేదని ప్రజలకు తెలిపారు. జగనన్న కాలనీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని, వారు ఇచ్చే ఇంటి బిల్లుకు కూడా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని మాధవి గారు మండిపడ్డారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com