కడప ( జనస్వరం ) : కడప జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి పోస్టర్ ను కడప జనసేన పార్టీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మట్లాడూతు ఇకపై జనసేన పార్టీ ఆద్వర్యంలో నియోజవర్గ పరిధిలో జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరించిన మరుసటి రోజే క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలన అనంతరం పరిష్కార దిశగా ఆలోచన చేస్తామని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని కడప నియోజకవర్గంలో తలపెట్టామని అన్నారు. ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసానికి కలిగించేలా ఈ జనవాణి కార్యక్రమం ఉపయోగపడుతుందున్నారు. ప్రజలు ఎన్నో రకాలుగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి గోంతుకనై నిలదీస్తాం.. అధికారుల దృష్టికి తీసుకువేళ్తాం పరిష్కరించకపోతే పోరుబాట పడతాం.. కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాం.. ఓటు వేయించుకున్న ప్రజాప్రతినిధులు జవాబుదారీగా వ్యవహరించాలని అన్నారు. పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో కడప ప్రజలు ఉన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచెన లేకుండా కృషి చేస్తామని అన్నారు. కడప నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో జరిగే జనవాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటనే ఆయుధంతో జగన్ రెడ్డి ను గద్దె దించుతాం.. కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా జనసేన టిడిపి పొత్తులో కైవసం చేసుకోవడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్, గజ్జల సాయి, బోరెడ్డి నాగేంద్ర, శేషు రాయల్, నాగరాజు, చార్లెస్, రాహుల్, దేవకుమార్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, శరత్ చంద్ర, అక్భర్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com