
చీపురుపల్లి ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గొట్నంది గ్రామంలో కొల్లి రాము, కొల్లి ఆశిరయ్య గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో 5 వ రోజు జనవాణి – జన చైతన్య యాత్ర లో భాగంగా గొట్నంది గ్రామంలో ప్రతి గడపకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను, మేనిఫెస్టో తీసుకెళ్లడం జరిగింది. మరియు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కల్పించమని, వెళ్లిన ప్రతి ఇళ్లలో వికలాంగులుకు,60 సవత్సరాల వృద్ధులుకు ఫెంక్షన్ రావటం లేదని దీన్ని పరిష్కరించమని గ్రామ ప్రజలు వారి సమస్యలను తెలియపరిచారు. అలాగే గ్రామంలో మాకు ఊహించని అశేషమైన ప్రజల స్పందన లభించింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనే మాటే వినిపిస్తుంది గ్రామం మొత్తం ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సహకారం లభించినందున పవన్ కళ్యాణ్ గారి తరపున కృతజ్ఞతలు ఇలాగే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ఆశయాలను సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గం జనసైనికులు పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, గేడ్డి గొల్లబాబు, చందక బాలకృష్ణ, బాకూరి శ్రీను,పైడితల్లి, దన్నాన యేసు, లెంక జగదీశ్ , పైల ధనుంజయ, ఆకుల సత్య, రెడ్డి ప్రతాప్ , వాల్లి సీతంనాయడు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.