గుంతకల్ ( జనస్వరం ) : జనస్వరం న్యూస్ నూతన సంవత్సరం క్యాలెండర్స్ ను గుంతకల్ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్తలను నిష్పక్షపాతంగా రాస్తున్న జనస్వరం టీమ్ కు అభినందనలు తెలియజేసారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా సామాన్య ప్రజలలో వెలుగు నింపాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com