
మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలను మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారు మదనపల్లి పట్టణ ప్రజలకు అలాగే జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనస్వరం న్యూస్ కేలండర్లు అలాగే కర్ణాటక చింతామణి జనసేన ఆర్మీ టీం క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. తర్వాత కేక్ కటింగ్ చేసి జనసేన నాయకులు, వీర మహిళలు,సైనికులు రామాంజనేయులు గారికి అలాగే చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారికి, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ గారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర, కోటికొండ చంద్రశేఖర్, అశ్వత్, ధరణి, యాసీన్ షేక్, గణేష్, తొక్కళ్ళ శివ, బహదూర్, వినయ్ కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు జనసేన సోను నూరుల్లా, CMY జనసేన టీం అధ్యక్షుడు గిడ్డు నరసింహ, సబుద్ధిన్ సునీల్, రాజ్ ప్రవీణ్, మధు పాల్గొన్నారు.