సామాజిక సేవలో జనసైనికులు ముందుంటాం, మైదానంలో మొక్కల తొలగింపు : జనసేన నాయకులు రాహుల్ సాగర్
సామాజిక సేవా చేయుటకు జనసేన కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని ఎమ్మిగనూరు అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా తెలిపారు. గోనెగండ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పెరిగిన పిచ్చి మొక్కలను శుక్రవారం రోజు జనసేనపార్టీ మండల నాయకులు, జాని, ఖాసీం, హరికృష్ణ, షఫీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా తొలగించారు. ఈ సంధర్బంగా నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ బడి గుడి రెండు ఒక్కటేనని దేవాలయాలతో సమానంగా పాఠశాలలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని అన్నారు. సర్వ మతాల విద్యార్థులు ఐక్యతను చాటేలా విద్యను అభ్యసిస్తూ శాశ్వత స్నేహాలను జీవితకాలాల పాటు కొనసాగించేలా చేసే శక్తి బడికి మాత్రమే వుందని అలాంటి పాఠశాలలకు సేవా చేసే అవకాశాలు కల్పించుకొనే ప్రయత్నాలు చేయాలని ఎందరినో గొప్పవారిని చేసి పంపుతున్న పాఠశాలలను విస్మరించడం భావ్యం కాదని అన్నారు. నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా మాట్లాడుతూ పాఠశాలలో ప్రస్తుతం జరుగుతున్న నాడు నేడు పనులలో భాగంగా అధికారులు నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు క్రీడామైదానం విడిచి నిర్మాణాలు జరిగేలా కృషిచేయాలని తెలిపారు. గతంలో నిర్మించిన పాత భవనాలకు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఇష్ట రాజ్యాంగ నిర్మాణాలు చేశారని ప్రస్తుతం క్రొత్తగా నిర్మించే భవనాలకు స్థలాలు సరిపడటం లేదనే కారణాన్ని చూపించి క్రీడా మైదానంలో నిర్మాణలు చేపడితే సహించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు సుబాన్, ముస్తాఫ్ చాంద్, మెహబూబ్, రఫీ, చాంద్, మల్లి, పాల్గొన్నారు.