
వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo, వీరఘట్టం మండలంలో 21వ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా వీరఘట్టం మండల కేంద్రముతో పాటు వివిధ పంచాయతీలలో ఉన్న ప్రభుత్వం కార్యాలయలను జనసైనికులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ వీరఘట్టం మండలంలోని ప్రభుత్వం కార్యాలయలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్ర లో ఐ.సి.డి.ఎస్, విద్యుత్ ఉప కేంద్ర, వ్యవసాయ శాఖ కార్యాలయం, తుడి, చిట్టపుడి వలసలో పశువైద్యశాలలు పునాదులు బీటలు ఏర్పడ్డాయి. ఆర్.టి.సి బస్ స్టాప్ లేక ప్రయాణీకులు రోడ్ ప్రక్కన వేచివుండవలసి వస్తుంది. ప్రభుత్వం డిగ్రీ కళాశాల తరగతి గదులు లేక జూనియర్ కళాశాల లో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు పక్క భవనం నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని తెలిపారు. జనసేన జాని మాట్లాడుతూ చాలా గ్రామాలలో స్మశానవాటికలకు రహాదారులు లేవు. మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వచ్చు ప్రజలు సులబ్ కంప్లెక్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్.టి.సి బస్ కంప్లెక్ నిర్మాణం చేపట్టాలని, మండల కేంద్రములో చేపట్టిన రోడ్ విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మండల పరిధిలోని గ్రామీణ రహదారులు బాగుచేయాలని కోరారు. కురుపాం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకుడు తాడేల శ్రీరాం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం కార్యాలయలు వర్షాలకు శ్లాబ్లు పెచ్చులు వుడుతున్నాయని, వర్షం నీరు గోడలద్వారా నీరు చిప్పుతున్నాయి, కార్యాలయలలోకి వర్షం నీరు చేరుతుంది. ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణంలో అధికారులు పర్వవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం కార్యాలయాలు కాలం చెల్లక ముందే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ప్రజాధనం వృధా చేస్తున్నారు అని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనపార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి జనసైనికుడు ఆకుoటదీక్షతో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, శంకర్రావులు పాల్గొన్నారు.