
అరకు ( జనస్వరం) : అరకు నియోజకవర్గ కేంద్రం పరిధిలో గల పెద్దల బుడు పంచాయితీ గంజాయిగూడ గ్రామంలో జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియ, అల్లంగి రామకృష్ణ, కిలో రాజభారత్, ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా మాట్లాడుతూ జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు గిరిజనులను క్లుప్తంగా వివరించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తెలిపారు. కావున రానున్న రోజుల్లో జనసేన పార్టీని మీరు ప్రతి ఒక్కరు ఆదరించాలని, 2024 సంవత్సరములో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.