గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం గ్రామపంచాయతీ, కార్వేటినగరం విజయ మాంబాపురంలోని పట్టెం వారి ఇండ్లలో గత వారంలో నిర్వహించిన జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ ) కార్యక్రమంలో నిరుపయోగంగా ఉన్న చేతి బోరును అక్కడి గ్రామస్తులు నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్నకు చూపించారు. ప్రజల పక్షాన నిలబడ్డమే జనసేన పార్టీ బాధ్యత అని, ప్రజా సమస్యలను పరిష్కరించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. కరెంటు లేని సందర్భంలో, ట్యాంకులో నీళ్లు అయిపోయిన సందర్భంలో, నీటి ఎద్దడికి గురయ్యే వారమని తెలియజేశారు. ఈ చేతి బోరును రిపేరు చేయడం ద్వారా పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ స్థానిక కార్వేటి నగరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ వెంటనే నిరుపయోగంగా ఉన్న చేతి బోరును అందుబాటులోకి తీసుకొచ్చి, గ్రామస్తులకు నీటి సౌకర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. యుగంధర్ మాట్లాడుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమస్యలు చెప్పిన వెంటనే, పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు జనసైనికులు, గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జనసేన పార్టీ నాయకులు నాదముని ఉన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com