ఆముదాలవలసలో జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన జనసైనికులు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని కొర్లకోట గ్రామంలో ఈ రోజు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు లో భాగంగా జనసేన ఆమదాలవలస ఇంచార్జీ పేడాడ రామ్మోహనరావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలోపేడాడ రామ్మోహనరావు మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా అధ్యక్షుల వారి పుట్టిన రోజులోపు నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు రేపటి భవిష్యత్ అయినటువంటి యువత సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటి అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసినదిగా కోరుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జనసేన ముఖ్య కార్యకర్తలు పేడాడ నర్సి0గరావు,శశి ,ప్రసాద్ రావు,అనూస్, మహేష్, ధనుంజయ్, సతీష్ మరియు బీజేపీ-జనసేన జడ్పీటీసీ అభ్యర్ధి పేడాడ సూరపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.