అనంతపురం ( జనస్వరం ) : నార్పల మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్దఎత్తున జనసేన కార్య కర్తలు సమావేశానికి హాజరయ్యారు. జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన తెలుగు దేశం పొత్తు ఎంతో చరిత్రాత్మకమని కొనియాడారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీలో కచ్చితమైన గుర్తింపు ఉంటుంది అన్నారు. మండల వ్యాప్తంగా 300 పైన క్రియశీల సభ్యలున్నారని ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసి వైసీపీ దుష్టపాలన నుండి ఆఁధ్రప్రదేశ్ ని విముక్తి చేసి ప్రజా పాలనని స్థాపించే విదంగా కష్టపడాలని కార్యకర్తలను కోరారు. శింగనమల సమన్మయ కర్త సాకే మురళీకృష్ణ మాట్లాడుతూ శింగనమలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు . టీడీపీ జనసేన పార్టీల తరుపున ఉమ్మడి ఆభ్యర్ధిని ఎన్నుకోవడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవ్వరిని ప్రకటించిన గెలుపే లక్ష్యంగా పని చేయాలనీ కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చొప్ప చంద్ర, విజయమ్మ, కృష్ణమూర్తి, శశికళ, నార్పల మండల నాయకులూ తుపాకుల భాస్కర్, పొన్నతోట రామయ్యగా, తేజ లక్ష్మి, ఎర్రి స్వామి, శ్రీకాంత్ రెడ్డి, అశ్వర్థ రెడ్డి, కేశేపల్లి జయంతి, వినోదం లోకేష్, వినోదం నారాయణ స్వామి, కుళ్లాయప్ప, పెద్దఎత్తున నార్పల మండల జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com