- ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత
- జనసేన సానుభూతిపరులను భయపెట్టడమే లక్ష్యం
- భారత రాజ్యాంగాన్ని, జాతీయ నాయకులను అపహాస్యం చేస్తున్న వైసీపీ పాలన
- రాష్ట్రంలో ఎక్కడ తట్టెడు మట్టి వేయలేడు కానీ ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు?
మంగళగిరి, (జనస్వరం) : కక్ష్య సాధింపు కోసమే ఇళ్ల కూల్చివేత అని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆయన అధ్యక్షతన ఆదివారం ఇప్పటం గ్రామంలో జరుగుతున్న పరిమాణాలు, వైసీపీ రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారాలు పై జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డిపార్ట్మెంట్ వాళ్లకి మరియు పోలీస్ సిబ్బందికి నిన్నటి పవన్ కళ్యాణ్ పర్యటనకి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్లకి ఇప్పటం గ్రామం మీద ఎందుకు ఇంత కక్ష, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇప్పటం గ్రామానికి ఒక బస్సు సౌకర్యం లేదు, కనీస సౌకర్యాలు లేవు గాని,ఈ వైసీపీ వాళ్లకి 120 అడుగుల రోడ్డు కావాలంటు ఇళ్లను కూల్చడం, కక్షపూరితమైన చర్య అని విమర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కక్షతోనే పోలీసులు పవన్ కళ్యాణ్ ను ఇప్పటం వెళ్లకుండా అడ్డుకున్నారని, ఇప్పటంలో కేవలం గోడలు తొలగించినట్లు వైసిపి నేతలు చెబుతున్నారని కానీ వాస్తవానికి గ్రామాన్ని వల్లకాడులా మార్చారని విమర్శించారు. సరైన రీ సర్వే బ్లూ ప్రింట్ లేకుండా రహదారి విస్తరణ చేస్తూ రోడ్డు మధ్యలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను వదిలేయటం అభివృద్ధా అని ప్రశ్నించారు. వైసిపి మంత్రులు ఇప్పటం వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షలతో నేరుగా ఆయనే వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఎప్పటికీ ఇప్పటం గ్రామ ప్రజలకు రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ శేఖర్, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, పొన్నూరు నియోజకవర్గ నాయకురాలు పార్వతి నాయుడు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపరౌతు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com