రైతుల క్షేమమే జనసేన లక్ష్యం : జనసేనపార్టీ నాయకులు పూల చైతన్యమోహన్
రైతుల క్షేమమే జనసేన లక్ష్యం అని జనసేనపార్టీ పలమనేరు నియోజకవర్గ నాయకులు పూల చైతన్య మోహన్ స్పష్టం చేశారు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేపట్టి రైతులకు అండగా ఉంటామని చెప్పిన పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గం వరకు పలమనేరులో జనసేనశ్రేణులు దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పూలచైతన్యమోహన్ మాట్లాడుతూ.. నివర్ తుఫాను వరదల వలన పంట నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ.35,000/-లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే తక్షణ సహాయం కింద రూ. 10,000/- లు ను అందించాలని కోరడం జరిగింది. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోగా జనసేన అధ్యక్షులు రైతులకు అండగా ఆంధ్ర రాష్ట్ర మంతటా దీక్ష చేపట్టిన నేపథ్యంలో తాము కూడా పలమనేరులో దీక్ష చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గం తరపున దీక్ష చేపట్టడానికి దీక్షా శిభిరాన్ని ఏర్పరుచు కున్నా.. పోలీసులు మాత్రం శాంతియుతంగా జనసైనికులు చేపడుతున్న దీక్షను అడ్డుకుని దీక్షా శిబిరాన్ని సహితం తొలగించారని పూలచైతన్యమోహన్ చెప్పారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా కూడా మొక్కవోని దీక్షతో జనసైనికులు తలపెట్టిన దీక్షను, దీక్షా శిబిరం ఎదుటనే కూర్చుని దీక్షను కొనసాగించడం జరిగింది. రైతుల పక్షాన నిలిచి వారి క్షేమమే తమలక్ష్యం అని జనసేన పార్టీ పలమనేరు నియోజకవర్గ కోర్డినేటర్ పూల చైతన్య మెహన్ సుస్పష్టం చేశారు.
మేము 06/12/2020 ఆదివారం రోజు మధ్యాహ్నం పోలీసులను సంప్రదించి వారి నుండి దీక్షకు అనుమతిని కోరడం జరిగింది. కానీ ఫలితం లేదు .. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా అనుమతి నిరాకరించారని పూలచైతన్యమోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు తక్షణ సాయం అందించాలని జనసేన నాయకులు, జనసైనికులు శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వారిపై బైండోవర్ కేసులు అక్రమంగా నమోదు చేశారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు తమ జనసైనికులపై ఎన్ని బనాయించినా ఎల్లప్పుడూ రైతు, ప్రజాపక్షాన నిరంతరం నిలిచి పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తామని, వెనుకాడే ప్రసక్తేలేదని వివరించారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ : పూల చైతన్య మోహన్ తో పాటు పలమనేరు రూరల్ మండల ఇంచార్జి : మోతుకూరి నాగరాజు గంగవరం మండల ఇంచార్జి టైలర్ రాజు, బైరెడ్డిపల్లి మండల ఇంచార్జి దిలీప్ పసుపు లేటి, వీ కోట మండల నాయకులు బాబు, పెద్దపంజాణి మండల నాయకులు రంపాల శివకుమార్, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.