
ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా పార్లపల్లి, పెసలదిన్నె, ఏనుగు బాల, దైవందిన్నె గ్రామ ప్రజలతో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రేఖ గౌడ్ సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్ర సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ అధికారానికి సంబంధం లేకుండా కౌలు రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. అధికార ప్రతిపక్షాలు కేవలం మాటలకి విమర్శలకే పరిమితమయ్యారని 151 సీట్ల భారీ మెజారిటీతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని, విమర్శించారు. ఇప్పటికైనా అధికారపక్షం మేలుకోవాలి అని అఖిలపక్షం ఏర్పాటు చేసి రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ప్రధాన కార్యదర్శి బజారి, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, షబ్బీర్ రాజు ఎల్లప్ప మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.