ప్రాణ రక్షణే ధ్యేయంగా జనసేనాని జన్మదిన వేడుకలు : జగ్గయ్యపేట జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ద్వారా చేస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా, ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ టి సి డిపో సెంటర్ నందు తిరుమల బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో "రక్త దాన" శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ మోసిన్ అహ్మద్ గారు పాల్గొని రక్త దాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ జనసేనాని జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రక్త దానం కార్యక్రమం నిర్వహించామని కరోన మహమ్మారి ఉన్నప్పటికీ అధ్యక్షుల వారి మీద ప్రేమతో సుమారుగా 40 మందికి పైగా రక్త దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత వారం రోజులుగా చేస్తున్న సేవా వారోత్సవాలు ఘనంగా జరిగాయి అని, దీనికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికునికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా నిన్న రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో ముగ్గురు జనసైనికులను కోల్పోవడం జనసేనకు తీరని లోటు అని, మృతుల పవిత్రాత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమంత్, రిషి, నాగ భాస్కర్, త్రిశాంత్, రాం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com