Logo
Date of Publish : 03 September 2022, 6:21 am
Editor : Sake Naresh

కోవూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

   కోవూరు ( జనస్వరం ) : జనసేనపార్టీ అద్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గం , జొన్నవాడ మహా పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయంలో 108 టెంకాయలు కొట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించడం జరిగింది. జనసేన నాయకులు డా. దాడి అజయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రములోనే కాకుండా, దేశవ్యాప్తంగా విలక్షణమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. తన కష్టార్జితమైన సొమ్మును ఆత్మహత్యలకు పాల్పడిన సుమారు 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రానికి మరియు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా” నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క జన సైనికుడు తన వంతు ఆర్థిక సహాయాన్ని పార్టీకి అందించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేనపార్టీ నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు బద్దేపూడి సుదీర్ గారు,సునీల్ గారు, శ్రీకాంత్ గారు,మస్తాన్ గారు,విడవలూరు మండలం నాయకులు మల్లి గారు,బాలాజీగారు, బుచ్చి మండల ప్రదాన కార్యదర్శి ఇబ్రహీమ్ గారు, వేణు గారు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com