రణస్థలంలో జనసేనాని జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా రణస్థలం పంచాయతీలో రణస్థలం మరియు బావరాజుపాలెం గ్రామాలలో ముందుగా శివాలయం ఆలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా మరియు 2024లో సీఎం అవ్వాలని ప్రత్యేక పూజలు జరిపించారు మరియు బావరాజుపాలెం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. రెండు గ్రామాలలో బ్లీచింగ్, శానిటైజర్ మరియు రణస్థలం గ్రామంలో నిరుపేద వయసు పడిన వాళ్లకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది . గ్రామసచివాలయంకు శానిటైజర్, మాస్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది. సువ్వాడ రామారావు మాట్లాడుతూ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులు అయినా శ్రీ దన్నాన చిరంజీవిగారు, రెడ్డి భాస్కర్ గారు, అంజిబాబు గారు, షణ్ముఖ గారు పాల్గొన్నారు. సువ్వాడ రామారావు, గొల్ల, ఆనంద్, సురేష్, అయ్యప్ప, సూరిబాబు, చంటి, కనకరాజు, s.బద్రి, ప్రేమ్, రమేష్, లక్షుమన, రమణ,సురేష్, నవీన్, శేఖర్, శ్రీను, జగదీశ్, ముకుంద, ప్రసాద్, శ్రీను, గణేష్, దుర్గా, అది, మని, సత్యనారాయణ, అప్పారావు, ప్రసాద్, రామకృష్ణ, గని, డాన్, జనసైనికులు పాల్గొన్నారు.