
ఆళ్ళగడ్డలో జనసేనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఆళ్ళగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఆళ్లగడ్డ జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య ఘనంగా నిర్వహించారు .పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో 30 మంది జనసైనికులు రక్తదానం చేసారు అలాగే సూర్తి మదర్ హోమ్స్ అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలసాగరం జెడ్ పి హెచ్ స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈకార్యక్రమంలో జనసేన నాయకులు మహబూబ్ బాషా, రాజారామ్, ఆంజనేయులు అక్బర్, వెంకట్, వెంకటసుబ్బయ్య, కోటి, సురేంద్ర, కిరణ్, బాషా, తిమ్మరాజు, మద్దిలేటి, గురప్ప, శివ, నరసింహ, శివకుమార్, పవన్ కుమార్ రె,డ్డి ఆచారి వెంకటసుబ్బయ్య, రసూల్, లోకేష్, వెంకటేష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.