సాలూరు పట్టణంలో జనసేనాని జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను సాలూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి అలాగే నిన్న కుప్పంలో ప్రమాదవశాత్తు మరణించిన అభిమానులకు సంతాపం తెలియచేసి అనంతరం పట్టణములో అనాథ శరణాలయంలో వృద్ధులకు రైస్ ప్యాకేట్లు నిత్యావసర సరుకులు అందచేశారు. అలాగే లెప్పర్సి కాలనిలో పేదలకు బియ్యం కొన్ని నిత్యావసర సరుకులు అందచేశారు. అనంతరం చిన్న పిల్లలతో కేక్ కట్ చేయించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు రేగు మహేశ్వర రావు ,శివ కృష్ణ, సంతోష్,రవి,పరశురాం,యోగి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.