Logo
Date of Publish : 24 January 2023, 3:43 pm
Editor : Sake Naresh

జనసేనాని వారాహి యాత్ర చరిత్ర సృష్టిస్తుంది : గుర్రాన అయ్యులు

            విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని జనసేన నాయకుడు గురాన అయ్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ.. మంగళవారం ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోవెలలో గురాన అయ్యలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. పవన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. పవన్ వారాహి వాహనాన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ప్రజలే పవన్ కల్యాణ్‌ను ముందుకు నడిపిస్తారని చెప్పారు. ఏపీ ప్రజలను మిగిలిన రాష్ట్రాల ప్రజలు జాలిగా చూస్తున్నారని తెలిపారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్‌ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతీ పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందన్నారు. ఏపీ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం పవన్ వల్లే సాధ్యమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జన సేన యువ నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్, రవీంద్ర,హుస్సేన్ ఖాన్, సురేష్, రామకృష్ణ, కులదీప్,పవన్ కుమార్, ఏంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com