సికబడి గ్రామంలో జనసేనాని జన్మదినోత్సవాలు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని కురుపాం నియోజకవర్గం సికబడి గ్రామంలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామం లోని నిరుపేదలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు మందులు, కూరగాయలు అందించడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పనులు లేక చాల మంది అనేక రకాలుగా వారి జీవనం సాగించటానికి ఇబ్బంది పడుతున్నారని, మరీ సికబడి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు పనులు లేక తినటానికి ఏమి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి తమ వంతుగా సహాయం చేయటం జరిగిందని ఆయన తెలిపారు. తమవంతు సాయంగా అనాధ పిల్లలకు 4జతలు బట్టలు, యాచకులకు దుప్పట్లు, వృద్ధులకు పండ్లు, పెద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ భాగంలో భాగంగా 50 మొక్కలు నాటడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొనడం జరిగింది.