Logo
Date of Publish : 03 September 2020, 9:47 am
Editor : Sake Naresh

జనసైనికుల ఆధ్వర్యంలో పెదపాడులో జనసేనాని జన్మదినోత్సవ, సేవా కార్యక్రమాలు

జనసైనికుల ఆధ్వర్యంలో పెదపాడులో జనసేనాని జన్మదినోత్సవ, సేవా కార్యక్రమాలు

        జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వారోత్సవాలను జనసైనికుల ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో కార్యక్రమాలను జనసైనికులు నిర్వహించారు. పెదపాడులోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత జనసేన సిద్ధాంతాలలో ముఖ్య అంశమైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరావు గారితో కలసి మొక్కలు నాటడం జరిగింది. మెంటే సౌజన్య గారు మాట్లాడుతూ జనసేనాని జన్మదినోత్సవాల సందర్భంగా కుప్పంలో జరిగిన ప్రమాదంలో  ముగ్గురు జనసైనికులు మరణించడం బాధాకరం, మిగిలిన 4 గురు తొందరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలకు హైదరాబాదు నుంచి వచ్చిన సాగర్ పల్నాటి, వెంకట సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యానర్లలో ఫోటో వేసి ఆహ్వానిస్తే వచ్చి పోయే నాయకులు వీళ్ళను చూసి సిగ్గు పడాలి అన్నారు. అలాగే ఏపూరు గ్రామంలో పేదలకు దుప్పట్లు పంచి,  కో - ఆర్డినేటర్ గేదెల నరేంద్రను అభినందించారు.  పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ మెంటే సౌజన్య, సాగర్ పల్నాటి, వెంకట సుధాకర్, జనసేన నాయకులు, గేదెల నరేంద్ర, బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com