Logo
Date of Publish : 19 April 2022, 5:48 pm
Editor : Sake Naresh

ముత్యాలమ్మ పండుంగ సందర్బంగా చలివేంద్రం, ప్రసాదం పంచిపెట్టిన జనసేన యువనాయకుడు ముత్యాల నాయుడు

    విజయనగరం  ( జనస్వరం ) : గాజులరేగ 48వ డివిజన్ లో గ్రామదేవత ముత్యాలమ్మ 69వ వార్షికోత్సవం సందర్బంగా జనసేన యువ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి చెల్లూరి ముత్యాల నాయుడు సుమారు వెయ్యి మందికి పులిహోర ప్రసాదాన్ని, మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ పాలవలస యశస్వి హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు వచ్చినా, సేవ చేయాలన్నా రాష్ట్రంలో జనసైనికులు మాత్రమే ముందుంటారని, గత మూడేళ్లుగా మహమ్మారీ కరోనా వలన గ్రామదేవత ముత్యాలమ్మ పండుగ గాజులరేగ ప్రజలు చేసుకోలేక పోయారని, ఈ సంవత్సరం కరోనా లేకపోవడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో అమ్మవారి పండుగ చేసుకోవడం ఆనందదాయకమని అన్నారు. మా జనసేన యువనాయకులు ఇటువంటి మంచి తరుణంలో ఈ కార్యక్రమం చేయడం అభిందనీయమని జనసైనికుల సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరామహిళ, జనసేన కార్పొరేట్ అభ్యర్థి మాతా గాయిత్రి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు), రౌతు సతీష్, డాక్టర్ మురళి మోహన్, గాజులరేగ జనసేన యువత లెంక నాగార్జున, సీర కుమార్, నడిపిల్లి సత్తిబాబు, గిడుతూరీ సతీష్, గండ్రేటీ శ్యామ్, ఆకిరీ రవి, రాజేంద్ర, ప్రసాద్, జనా, రామకృష్ణ, భాషా, జనసేన నాయకులు, జిల్లాచిరంజీవి యువత నాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, బూర్లి విజయ్, మజ్జి శివశంకర్, ఎర్నాగుల చక్రవర్తి, రవిరాజ్ చౌదరి, తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com