
అరకు, (జనస్వరం) : అరకు మండలం గన్నెల పంచాయతీ పరిధిలో గల గజర గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా. అల్లంగి, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారము సాయంత్రం ఆయ గ్రామాలలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా ఆయా గ్రామంలో రోడ్డు సమస్య ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. దీనికై స్పందించిన జనసేన పార్టీ నాయకులు సాయిబాబా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తదనంతరం ఇంటింటికి జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మదన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.