అరకు, (జనస్వరం) : విశాఖ మన్యం అరకు నియోజకవర్గము అనంతగిరి మండలం, టోకూరు పంచాయతీ పరిధిలో గల బోడుగూడా గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగినది. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు గూర్చి గిరిజనులకు వివరించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా అంటూ ఏమీ లేదని రెండు పార్టీలు కూడా గిరిజన బతుకులతో ఆడుకుంటున్నారని, వీరికి బుద్ధి చెప్పే రోజులు వస్తాది అని మీరు అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను, చట్టాలను పటిష్ఠంగా అమలు చేయకపోయిన, గిరిజన చట్టాలు హక్కులకోసం పోరాడుతున్న ప్రజాసంఘ నాయకులను ముందస్తు అరెస్టు లతో ఉద్యమాలను అణిచివేసే ధోరణి వైయస్సార్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అరెస్టులతో ధర్మాలు ఆపలేరని ప్రజా అవసరాల రీత్యా ఉపయోగపడే ఉద్యమాలకు కులాలకు అతీతంగా మతాలకతీతంగా ప్రజాసంఘాల కతీతంగా గిరిజనుల అందరూ కలిసి రావలని పిలుపునిచ్చారు. దీనికి ముందుగా జనసేన మాటలు - జనంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అజయ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com