Logo
Date of Publish : 02 April 2022, 1:53 pm
Editor : Sake Naresh

చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికీ లక్ష రూపాయలు జనసేన ఆర్ధిక సహాయం అందచేస్తుంది

    అమరావతి, (జనస్వరం) : రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాల..అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80 కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోంది. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు. వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాం. ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందచేస్తుంది. ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నాం. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తాను. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది.మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటంలేదు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com