నెల్లిమర్ల ( జనస్వరం ) : పూసపాటిరేగ మండలం ఇలా చోడవరం గ్రామంలో గల సిపిఎఫ్ ఆక్వా పరిశ్రమలో అన్యాయంగా ఎటువంటి కారణాలు తెలుపకుండా విధుల నుంచి పనిచేస్తున్న కార్మికులను తొలగించడం జరిగింది. విధులు కోల్పోయిన కార్మికులు నిర్మల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గారికి వచ్చి తెలపగా విషయం తెలుసుకున్న మాధవి గారు గత మూడు నెలలుగా జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. లోకం మాధవి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్న కార్మికుల్లో చిచ్చు పెట్టి తొలగించని కార్మికుల్లో కొందరిని వీధుల్లోకి తీసుకొని మిగిలిన వారిని రోడ్డుమీద పడేయడం పరిశ్రమ యాజమాన్యానికి తగదని, గత మూడు నెలలుగా పరిశ్రమ నుంచి తొలగించడం పై ఒప్పంద కార్మికులు నిరసన వ్యక్తం చేయడంతో అందులో కొందరు కార్మికులను తీసుకొని మిగిలిన వారిని పక్కన పెట్టేసారు. పరిశ్రమలకి ఆనుకుని ఉన్న గ్రామాలలో ఉన్న స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, అన్యాయంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున తమ పోరాటం ఆగదు అని తెలియచేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com