Logo
Date of Publish : 27 July 2021, 3:48 pm
Editor : Sake Naresh

నిరుపేదలు ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుంది : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

              పాల సముద్రం , (జనస్వరం) :   పాల సముద్రం మండలం, SKR పురం AAW గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు లోకనాధం నాయుడు గారి జన్మదినం సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంఛార్జ్ యుగంధర్  పొన్న గారు  పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లోకధనం నాయుడు నిస్వార్ధ, నిరాడంబరత, సేవాతత్పరత కలిగిన నాయకులు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అక్కడ లోకనాధం గారు ఉంటారు. జనసేన ఎల్లప్పుడూ అందరికి అన్నివేళల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనీ నాయకులకు తెలియజేసారు. ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రజాక్షేమమే పరమావధిగా భావించి వారి కోసం కొంత త్యాగం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలకు కూరగాయలు వితరణ చేసారు. గ్రామాభివృద్ధికి జనసేన ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు గురుస్వామి, నియోజకవర్గం సమన్వయకర్త రాఘవ, నాయకులు వెంకటేష్, బి జె పి జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మ రాజు, చిన్న స్వామి, నాయకులు బాలయ్య, గ్రామ పెద్ద రత్నం, ఆనందయ్య, మంజు మరియు జనసైనికులు , గ్రామస్తులు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com