
సూళ్లూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో మరియు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని సంకల్పించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేస్తున్న మన ఇల్లు “మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా తడ మండలం మాంబట్టు గ్రామంలో కొన్ని రోజుల క్రితం నిర్వహించినప్పుడు పెంచలదొర అనే దివ్యాంగుడిని గుర్తించి నేడు మిషన్ మారుతి సంస్థ సహకారంతో జనసేన పార్టీ తరఫున సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో NRI బాల సుబ్రమణ్యం గారి చేతుల మీదుగా ట్రై సైకిల్ అందించి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. అలానే సహకరించిన మిషన్ మారుతి సంస్థ అధ్యక్షులు Dr నవీన్ కుమార్ మరియు టీమ్ కి సోమశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్, తడ మండల కార్యదర్శి పవన్ కాశి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జనసేవ కార్యక్రమంలో స్థానిక మాంబట్టు మరియు కట్టవ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.