Search
Close this search box.
Search
Close this search box.

ఓడిపోయి గెలిచిన జనసేన

జనసేన

                మార్పు కోసం, సామాజిక సమతుల్యం కోసం, ప్రశ్నించటం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం ఏర్పడిన సిద్ధాంతాల రాజకీయ ప్రస్థానాన్ని జనం అర్ధం చేసుకోలేక పోయారో, ధనం, మద్యం ముందు ఆశయాలు కనిపించక ఓడించారో. జనానికి నమ్మకం కల్పించటంలో విఫలం అయ్యామో కానీ జనసేనను పరాజయం వరించింది. ఓట్ల రాజకీయం గెలిపించకపోయినా, నోట్ల రాజకీయం ఓడించినా కానీ కోట్ల జనం బాధలు ఆయనను రాజకీయానికి దూరంగా ఉంచలేకపోయాయి. ఓటమిని అంగీకరించటం అందరికీ సాధ్యం కాదు కాని అంగీకరించినంత సులువు కాదు స్థైర్యంతో నిలబడటం. ఓడించిన జనానికి అండగా నిలవడం అదే నైతిక విజయం. పరాజయాన్ని పరాభావం అనుకొని ఆగిపోలేదు రాహువు పట్టిన పట్టొక సెకండు అనుకొని గ్రహణం విడిచిన సూరీడల్లే ఓటమిని ఉత్తేజంగా మార్చుకొని ప్రజా సమస్యలను గుర్తిస్తూ పోరాటం చేస్తూ పరిష్కారం కూడా అందిస్తున్నది నేడు జనసేన.

               గెలుపు అధికారం అందుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఓటమి ఎన్నో పాఠాలు, ఆనుభవాలను నేర్పిచింది ధైర్యంగా నిలబడేందుకు దోహదం చేసింది వైఫల్యానికి గల కారణాలు విశ్లేషించుకొని ఓడిపోయాం కానీ ఆగిపోకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. తొణకని విశ్వాసంతో జనం మధ్యకు వెళుతోంది ప్రజా క్షేమం ధ్యేయంగా, వారి శ్రేయస్సు కోసం సమస్యల సాధన లక్ష్యంగా పార్టీ పనిచేస్తూ నిరంతరం జనంతో మమేకమై సాగుతుంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొత్త ఇసుక పాలసీ వల్ల జీవనాధారం కోల్పోయిన భవనిర్మాణ కార్మికులకు అండగా వారి తరుపున ప్రభుతాన్ని ప్రశ్నిస్తూ విశాఖలో నిర్వహించిన కవాతుకు, ఇసుక కోసం చేసిన కవాతుకు ఇసుక వేస్తే రాలనంత జనం పాల్గొని స్పందించటం ఓటమి విస్తుపోయినట్లయింది. భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేయటం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమై అస్తవ్యస్తంగా మారిన రోడ్ల అధ్వాన్న పరిస్థితిని అడుగుకో గుంత గజానికో గొయ్యి అంటూ ప్రభుత్వాన్ని నిలదీయటం, అన్యాయంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన సుగాలి ప్రీతి కొరకు, దివీస్ పరిశ్రమ, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ పై కవాతు, అభివృద్ధికి దూరంగా సంపద సృష్టి లేక అప్పుల భారం అధికమై ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతూ తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే, ఎన్నో సమస్యలపై అడుగడుగునా అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు.
                   అప్పుల భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకొని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా తన స్వార్జితం నుండి 30 కోట్ల రూపాయలు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఇప్పటివరకు 201 కుటుంబాలకు 1 లక్ష చొప్పున 2 కోట్లకు పైగా ఇవ్వటం సమకాలీన రాజకీయాల్లో ఎవరూ చేయని, చేయలేని సాహసం అది పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలిగే మానవతా దృక్పథం, ఆయనను శిఖరంలా నిలబెట్టే వ్యక్తిత్వం. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూ సామాన్యులకు రాజకీయాధికారం అందించే దిశగా యువతను మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం చేస్తున్నారు. పార్టీ అభివృద్ధిలో భాగమైన కార్యకర్తల కోసం భీమా సౌకర్యం కల్పించడం తద్వారా కుటుంబానికి భరోసా కల్పించే యోచన చేయటమే కాదు ఆచరణలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందేలా చేస్తున్నారు. 

             9 వ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన తీరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎప్పుడూ సహజ సిద్ధమైన ఆయన ఆవేదన ఆవేశంగా మారుతుంది. దానికి భిన్నంగా ఎంతో పరిణితి చెందిన రాజకీయ వేత్తలా స్థిర చిత్తంతో దిశా నిర్దేశం చేసిన తీరు ఇక పై రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. “నిశ్శబ్దంగా ఉన్న శతాబ్దం నిగళాలు తెంచుకొని నిలుస్తుంది జీవన కుహరంలో స్పందించే ధ్వని బ్రద్దలై భూమి దద్దరిల్లుతోంది పిడికెడు మట్టి కోసం కాదు ఒక పుట్టుక కోసం ఒక చేతన కోసం గాలి కోసం శాంతి కోసం గగనంలో ఎగిరే రెక్కల కోసం” అని శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు గెలుపు ఓటములకు అతీతంగా ఫలితాల ప్రభావం ఆయన ప్రయత్నానికి అడ్డు కాలేదు ఆటంకం కాదు రేపటి మన భవిష్యత్తు కోసం, మన గెలుపు కోసం ఆయన కార్యసాధకుడిగా కదులుతున్నాడు. పరాజయం వరించిన చోటనే గెలుపు వచ్చి ఆయన ముంగిట మోకరిల్లే రోజు వస్తుంది. విజయోస్తు…. 

#Written By 

– Team Naareeswaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240403-WA0002
ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత
IMG-20240331-WA0016
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
IMG-20240319-WA0007
అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
IMG-20240318-WA0009
ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్
IMG-20240315-WA0303
జనసేన నాయకులు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way