రాజంపేట ( జనస్వరం ) : కడపజిల్లా రాజంపేట నియోజవర్గం సిద్ధవటం మండలం లో బొగ్గెడివారిపల్లి పంచాయితీలో దుర్గమ్మ ( ఎస్టీ కాలనీ ) ప్రజలకు 10 సంవత్సరాల నుంచి అక్కడి ప్రజలకు వీధిలైట్లు లేవు. ఈ సమస్యను సిద్ధవటం మండలం జనసేన నాయకుల దృష్టికి తీసుకు వెళ్ళగా వారు అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది వారి పరిస్థితి చూసి చెల్లించడం జరిగింది. ఎన్నోసార్లు స్పందనలో జగనన్నకు చెబుతాం కార్యక్రమం సిద్ధవటంలో జరిగినప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం దుర్గమ్మ కాలనీ ప్రజలతోపాటు జనసేన పార్టీ సిద్ధవటం మండలం ఇంచార్జ్ రాజేష్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు అధికారులు మీద సీరియస్ అవ్వడం జరిగింది అధికారులు ఏమాత్రం ఇప్పటివరకు ఈ సమస్య పట్టించుకోకపోవడం శూన్యం ఈ విషయం సిద్ధవటం మండలం జనసేన నాయకులు జనసేన పార్టీ రాజంపేట నాయకులు ఎల్లటూరి శ్రీనివాస్ రాజు గారికి తెలియజేయడం జరిగింది. తానువెంటనే స్పందించి ఎల్లటూరి శ్రీనివాసరాజు గారు వారు సొంత నిధులతో 5 వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధవటం మండలం నాయకులు దగ్గరుండి వీధిలైట్లు బిగించడం జరిగింది బుగ్గెడివారిపల్లి వారి పంచాయితీ దుర్గమ్మ ఎస్టీ కాలనీ ప్రజలు రాజంపేట జనసేన నాయకులు ఎల్లటూరి శ్రీనివాస్ గారికి అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం ఇంచార్జ్ కొట్టే వెంకట రాజేష్, పెద్దపల్లి పంచాయితీ జన సైనికుడు వెంకట్, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com