
శ్రీకాళహస్తి ( జనస్వరం ) : క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలో గాంధీ వీధి నందు ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యడం లేదని, పారిశుధ్యం సమస్యలతో సతమతం అవుతున్నట్టు, స్ట్రీట్ లైట్లు సరిగా పని చెయ్యడం లేదని, నిత్యావసర ధరలు పెరగడం వలన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, నాయకులు పుష్ప గారు, జనసైనికులు భాను, పెంచలయ్య, గుర్రప్పా, శ్రీనివాసులు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.