తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బిళ్ళగుంట గ్రామంలో ఘనంగా పల్లెపోరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు రాజేష్ మాట్లాడుతూ 2019 మన శ్రీనివాస్ గారిని గెలిపించు లేకపోవడం మన దురదృష్టం అని అన్నారు. కరోనా వచ్చిన సమయంలో ప్రతి ఇంటికి నిత్యవసర సరుకులు, కూరగాయలు పంచి పెట్టడం అంతేకాకుండా బిళ్ళగుంట గ్రామంలో 10 లక్షలతో స్కూల్ నిర్మాణం ఏర్పాటు చేయడం అలాగే రమేష్ అనే యువకుడికి 50వేల రూపాయలతో కాలు ఆపరేషన్ చేయడం, మొన్న వచ్చిన వర్షాల్లో ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద 50,000 ఇచ్చి ఆ ఇల్లును పునర్మించడం ఇలా చాలా సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మరియు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఓటు వేసి గెలిపించవలసిందిగా బిళ్ళగుంట గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, ఉబయ గోదావరి జిల్లా అధ్యక్షురాలు కసిరెడ్డి మధులత, దర్శపర్రు సర్పంచ్ కోల శేషవేణి మార్కండేయులు మండల అధ్యక్షురాలు పెనుబోతుల సామలమ్మ స్థానిక నాయకులు గొన్నురి శ్రీనివాస్, మోర్చ రాజేష్,కలింగి చిన్న, కళింగి వెంకన్న, మోర్చ శేకర్ గన్నూరి రమేష్ తదితరులు తాడేపల్లిగూడెం నుంచి జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.