Search
Close this search box.
Search
Close this search box.

గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన విద్యా దీక్ష

జనసేన విద్యా దీక్ష

      నెల్లూరు ( జనస్వరం ) : వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ పీటర్, సెయింట్ జోసెఫ్ నెల్లూరు స్కూల్స్ ని మూయవద్దు అందులో చదువుతున్న 900 మంది పేద విద్యార్థులు చదువుని కాల రాయొద్దు అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక కపాడి పాలెం ఆర్.సి.యం చర్చి ఎదురుగా ఈరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 15 రోజుల నుంచి సిటీలో పేద బడుగు వర్గాలకు దాదాపు 100 సంవత్సరాలుగా విద్య ను అందిస్తున్న ఈ స్కూళ్ళ ను మూయవద్దని పలుమార్లు మీడియా ముందు ప్రస్థావించాము..అయినా కూడా సిటీ ఎమ్మెల్యే అనీల్ కి చీమ కుట్టినట్లు కూడా లేదు అనిపిస్తుంది. ఈ ప్రాంతపు ఓటర్లన్నా,వారి బిడ్డల చదువన్నా వారికి లెక్కలేనట్లుంది, అదే మీ బిడ్డలు చదువు విషయంలో ఇంత అజాగ్రత్త వహిస్తారా ? అని.. జనసేన పార్టీ తరపున నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం వేసిన కమిటీలో అన్ని వసతులు,ఆక్టివిటేస్ సరిగా ఉన్నాయని సర్టిఫై చేసినా ప్రభుత్వం ఈ స్కూళ్ళ ను ప్రభుత్వం ఎందుకు మూసివేయాలనుకుంటుందో తెలియడం లేదు. దగ్గర్లో గవర్నమెంట్ స్కూల్ ఏది లేదు,ఇంతమంది చదువులు వృధా అవుతున్నాయని ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం శూన్యం. మొన్న ఆర్డీవో గారు డిఈఓ గారిని పిలిచి ఈ తొమ్మిది వందల మందికి మనం అడ్మిషన్లు ఇప్పించగలమా..? లేని పక్షంలో ఒక్క సారిగా స్కూళ్ళ ను ఎలా మూసివేస్తారు పరిశీలించండి అని విచారణ చేపట్టమని కోరగా స్థానిక స్కూళ్ళ యజమాన్యం మాత్రం ఇదే చివరి రోజు ఇక నుంచి ఈ స్కూళ్ ఉండదు అని ప్రకటిస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులేమో ఈ స్కూలు మూయోద్దంటూ ఎవరైనా నిరసన కార్యక్రమానికి వెళ్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు,మీ బిడ్డల చదువుల కోసమే మేము పోరాడుతున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పిన విధంగా ప్రజలు భయపడి మాతో నడిచినా నడకపోయినా మేము మాత్రం వారి ప్రయోజనాల కోసం అండగా నిలబడతాము. ఎట్టి పరిస్థితుల్లో ఎంతోమంది వివేకవంతులను తయారు చేసిన ఈ స్కూల్ల ని నెల్లూరు నగరం కోల్పోకుండా చూసుకుంటాము. కొత్త అడ్మిషన్ లు ఆపి ఈ స్కూల్లో ఉన్న 900 మంది విద్యార్థులు చదువు పూర్తయ్యే వరకూ కొనసాగించాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తాము. మొన్న ఈ మద్య నాకు తెలిసిన కుర్రోడిని ఏం చదువుతున్నావ్ అని అడిగితే దానికి సమాధానం గా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విఆర్ కళాశాల లో చదివాను. రెండవ సంవత్సరంలో కాలేజి ఎత్తివేయడంతో డబ్బు కట్టి బయట చేరలేక చదువు మానేశానని చెప్పాడు. ఈ విషయం నన్ను చాలా బాధించింది కాస్త కోస్తూ చదువుకోవాలన్న ధ్యేయం ఉన్న పిల్లల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి పేదలకు విద్యను అందని ద్రాక్ష గానే చేస్తుంది. నిర్వాహకులు ఏమో ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది వందల సంవత్సరాలు నిర్వహించిన మాకు ఇప్పుడేమీ కష్టం కాదు మీకు ఏమైనా ఉంటే గవర్నమెంట్ అనే ప్రశ్నించుకోండి అని జవాబు చెప్పారు. ఇన్ని సంవత్సరాల నుంచి స్కూల్స్ నిర్వహిస్తున్న చర్చి సిబ్బంది పిల్లలను ఎంతో క్రమశిక్షణగా ఎంతో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దారు. ఒక తల్లి బిడ్డల్ని ఎన్ని సంవత్సరాలు చూసుకుంటుంది అనే లిమిట్ లేదో అదే విధంగా వీరు కూడా ఎన్ని సంవత్సరాల రన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రభుత్వం వీరి నుంచి స్కూలు వెనక్కి తీసుకున్నప్పుడు కూడా మేము బిడ్డలు చదువు నిమిత్తం నిలబడగలమని మరలా తిరిగి విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగానే చర్చి నిర్వాహకులు దానికి ఒప్పుకున్నారే గాని చర్చి నిర్వాహకుల తప్పేమీ కాదు. ఈ వైసీపీ ప్రభుత్వం ఈ స్కూళ్లను బెదిరించి మూయిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుంది. జనసేన ప్రస్తావించింది కాబట్టి ఇది మా సమస్య వైసిపి నాయకులు సమస్య కాదు అని కాకుండా ఇది ప్రజా సమస్య అని దృష్టిలో పెట్టుకొని పేదల విద్యను నిర్లక్ష్యం చేయకుండా తగు చర్యలు తీసుకొని ఈ విద్యా సంస్థలను కాపాడాలని కోరుకుంటున్నాను. పేదల విద్య కోసం మంచి పని చేస్తూ చేస్తున్నావు అని నాకు అంతర్గతంగా మద్దతునిచ్చిన నా శ్రేయోబిలాషులకు,నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచివచ్చి మద్దతు తెలిపిన జనసేన నాయకులు మరియు జన సైనికులు వీర మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసు కుంటున్నాను. రానున్న రోజుల్లో ప్రజాప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ఉపాధ్యక్షులు బద్దెపూడి సుదీర్, కృష్ణ పెన్నా జిల్లాల మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, రాధమ్మ, లక్ష్మి, కృష్ణవేణి, జాను, మనీషా, అరిగెల సాయిరాం, పూసల లక్ష్మిమల్లేశ్వరరావు, పసుపర్తి కిషోర్, దశినేటి అనీల్, పసుపులేటి ప్రసాద్, శ్రీమంత్, అండ్రగడ్డ సుధాకర్, ఈగ సురేష్, బద్దిపూడి సుధీర్, సుబ్బు, మహబూబ్ మస్తాన్, జనార్ధన్, చిన్నా జనసేన, నరేష్ కుమార్, కత్తి రాము, మణికంఠ, వేలాయుధం, వెంకటేష్, పొబ్బా సాయి, ప్రవీణ్, వెంకీ, నాగార్జున, కార్తీక్, బబ్లూ, రాజా, మౌనిష్, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, షాజహాన్, అమీన్, వర, బన్నీ, ప్రసన్న, ఖలీల్, నారాయణ, షారు, ఇబ్రహీం, సాయి, ఖాసిఫ్, అభి, మెహాబూబ్, హర్ష, చారు, వినయ్, పవన్, చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way