Logo
Date of Publish : 30 August 2021, 10:14 am
Editor : Sake Naresh

జనసేవతోనే జనసేన విజయం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

        విజయనగరం, (జనస్వరం) :  జనసేవతోనే జనసేన విజయం సాధించి తీరుతామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం జనసేన పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు అన్నారు. స్థానిక అయ్యన్నపేట, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) గారు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో, పార్టీ సిద్ధాంతాలతో, నవతర రాజకీయానికి శ్రీకారం చుట్టారని, అందుకే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సేవాదల్ విభాగాన్ని పెట్టి తన అభిమానులకు సేవాదల్ ద్వారా రాజకీయ ఒరవడిని తీర్చిదిద్దారని అన్నారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా ప్రజల్లో మమేకమైన, సేవాకార్యక్రమాలతో ప్రజల్లోకి వెల్తూ అధినేత ఆశయాలతో ముందుకెళ్తామని, ప్రజలపక్షాన ఎల్లప్పుడూ నిలుస్తూ జనసేవతోనే జనసేనపార్టీ విజయం సాధించి తీరుతుందని అన్నారు. మరొక అతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ విలువైన, గౌరవప్రదమైన రాజకీయాలకోసం, పాతికేళ్ల యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ పుట్టిందని, అధినేత మార్గంలో నడుస్తూ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే ప్రయోజనకరమైన వైద్య శిబిరాన్ని పెట్టడం చాలా అభినందనీయమని అన్నారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ నేత్రవైద్య శిబిరంలో సుమారు రెండు వందలమంది ప్రజలు తనిఖీలు చేయించుకున్నారని, అందులో పదహారు మందికి ఆపరేషన్లు ఉచితంగా  నిర్వహిస్తామని పుష్పగిరి కంటి ఆసుపత్రి పి.ఆర్.ఓ. సుబ్రహ్మణ్యం గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళలు, రాష్ట్ర చేనేతకార్మిక విభాగ కార్యదర్శి శ్రీమతి కాటం అశ్వని గారు, శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్ గారు, జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, కారి రాజేష్ బాబు, రఘు, రాముల కిరణ్, రవిరాజ్ చౌదరి, లోక్నాథ్, అలబొయిన శివగణేష్ కృష్ణ, అమ్మినాయుడు, కిలారి ప్రసాద్, బాబురావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com