రాయవరం ( జనస్వరం ) : రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో MPTC -1 గొల్లపల్లి అనురాధ గారు గ్రామంలో ప్రజల పడుతున్న ఇబ్బందులను గుర్తించి ముఖ్యంగా మూడు సమస్యలను 19/03/2022 న జరిగిన మండల పరిషత్ సమావేశంలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం అధికారులు స్పందించి పిర్యాదు చేసిన సమస్యలను పరిష్కారించారు.
1. పసలపూడి నుండి చెల్లూరు (సూర్యారావు పేట వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు) మెయిన్ రోడ్ బాగు చేయడం..
2. గ్రామంలో పాడైన విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ ఫార్మర్ వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని..
3. అంగన్ వాడి సెంటర్లలో కోడి గుడ్ల నాణ్యత గురించి..
ఈ సందర్భంగా అనురాధ గారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యదిక మేజరితో గెలిపించినందుకు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కారం చేయడమే నా లక్ష్యం అని పేర్కొన్నారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది జనసేన విజయం అంటే ప్రజా విజయంగా భావిస్తున్నానని తెలిపారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలి అని కోరుకుంటున్నానని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com