Logo
Date of Publish : 13 February 2022, 5:36 pm
Editor : Sake Naresh

మనం జనం కలిస్తే జనసేన గెలుపు తథ్యం : సత్యవేడు నియోజకవర్గ జనసేన నాయకులు

     సత్యవేడు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం బత్తి నాయుడు గిరిజన కాలనీ గ్రామం నందు చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు, మండల నాయకులు రాఘవేంద్ర, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడపకు జనసేన సిద్ధంతాలు, మేనిఫెస్టోలను వివరించడం జరిగింది. అనంతరం తడ శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అడిగితెలుసుకుంటూ గత కొద్ది రోజులుగా త్రాగు నీటి సమస్య ఉన్న స్థానిక సర్పంచ్, ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాకలాలు లేవు. త్రాగు నీరు తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంటపొలాలలో ఉన్నటువంటి మోటార్ దగ్గర నుంచి తెచ్చుకుని త్రాగుతున్నారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం ఎలక్షన్ సమయంలో వచ్చి ఓట్లు వేసుకుని వెళ్లిపోవడం తప్ప ఈ గిరిజన కాలనీలో పర్యటించిన దాకలాలు లేవు. కావున ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గిరిజన కాలనీలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి అని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుగంధర్, కోదండరామయ్య, వీర రాఘవులు, తేజ, వసంత రావు, ఆనంద్, ఆగస్టిన్, శ్యాం, అమృత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com