రాజోలు ( జనస్వరం ) : రాజోలు మండలం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారికి, రైతులకు వారి మద్దతు ధర పెంపు మరియు మద్దతు ధర నగదు రైతు ఖాతాలో సకాలంలో జమ చేయుట గురించి వినతి పత్రం అందజేసిన రాజోలు జనసేన వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనంద్ రాజ్. ఆయన మాట్లాడుతూ రాజోలు మండలంలోని దాళ్వా పంట రైతుల యొక్క సమస్యలను తమకు తెలియజేయడంతో వాటిని అధికారులు పరిష్కారం చూపించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. సమస్యలు :
1) ఒక 75 కేజీల ధాన్యం పండించుటకు వరి విత్తనం నాటి నుండి కోత కోసే వరకు అయ్యే ఖర్చు2200 రూపాయలు పెట్టుబడి అవుతుంది కానీ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర కేవలం 1470 రూపాయలు ఇస్తున్నారు.
2) గతంలో పోటస్, యూరియా ఎరువులు గతంలో ఫొటోస్ ధర 900 ఇప్పుడు ఫొటస ధర 1700 రూపాయలు పెరిగినాయి గతంలో ఎరువుల ధర కంటే ఇప్పుడు పోలిస్తే దాదాపుగా 80 శాతం పెరిగినాయి ఎరువులు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కు కూడా రైతులకు సబ్సిడీ ఇస్తే రైతులకు పెట్టుబడి తగ్గు తగ్గు తుందని కోరడం జరిగింది.
3) వ్యవసాయ యంత్ర పరికరాలు గ్రూప్ వారికి రైతుకు అందిస్తున్నారు అవి అధికార పార్టీ వాళ్లకి సేం దు తున్నాయి. బరకాలు, స్పేర్ మిషన్లు ఈ ఈ విధముగా యంత్ర పరికరాలు, రైతులకు స్వయంగా ఇచ్చిన ఎడల రైతులకు భారం తగ్గుతుంది.
4) రైతులకు ధాన్యం కల్లలా లు ఏర్పాటు చేయవలసింది వైస్ ఎంపీపీ ఇంటి పల్లి ఆనందరాజు, మెరక పాలెం MPTC పున్నం నాగ దుర్గ అధికారులు కోరడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com