Logo
Date of Publish : 23 October 2020, 7:30 am
Editor : Sake Naresh

వరదల వల్ల పంటలు ముంపుకు గురైన రైతుల్ని కలిసిన జనసేన వీర మహిళ కృష్ణవేణి సుంకర

వరదల వల్ల పంటలు ముంపుకు గురైన రైతుల్ని కలిసిన జనసేన వీర మహిళ కృష్ణవేణి సుంకర

                       జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం నియోజకవర్గంలో వరదల వల్ల పంటలు ముంపుకు గురైన కాపవరం గ్రామంలో రైతుల్ని జనసేన వీర మహిళ కృష్ణవేణి సుంకర గారు కలవడం జరిగింది.  రైతులు కోల్పోయిన పంటల గురించి, అలాగే కౌలురైతుల సమస్యలని తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఒక బ్రిడ్జ్ కూలిపోయి 1 సంవత్సరం అయినా ఇంకా దాన్ని నిర్మించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయింది.  రాష్ట్ర ప్రభుత్వం ఆ భ్రిడ్జ్ పక్కన ఒక చిన్న రోడ్డుబాట వేసారు దాని వల్ల ఇరువురి దారుల పక్కన పారుతున్న నీరు రైతుల పొలాల్లోకి వెళ్లిపోతుందని రైతులు కృష్ణవేణి దగ్గర వాపోయారు. దాని వల్ల వరిపంట పొట్ట దశలో ఉండగా అక్కడ వరదనీరు నిల్వ ఉండడం వల్ల వరిపంట కుళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.. అక్కడ ఉన్న రైతులు, గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ భ్రిడ్జ్ ని వెంటనే నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరుతానని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే పంటను కోల్పోయిన రైతులకు- కౌలు రైతులకు తక్షణమే ప్రభుత్వం సహాయాన్ని అందించాలని కృష్ణవేణి సుంకర జనసేన పార్టీ తరుపున డిమాండ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపవరం జనసైనికులు, రైతులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com