అనారోగ్యంతో బాధపడుతున్న యనాదయ్య కుటుంబానికి రూ.15,000 ఆర్థిక సహాయం చేసిన జనసేన వీర మహిళలు, జనసైనికులు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కన్నెమరకల యనాదయ్య కుటుంబానికి బుధవారం రూ. 15000 కోట్టె వెంకటేశ్వర్లు గారు ఆర్థికసాయం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఇల్లు గడవని స్థితిలో ఉన్న యనాదయ్య కుటుంబాన్ని గుర్తించి మర్రిపాడుమండల జనసేన నాయకులు చిన్నా జనసేన, జనసేన వీరమహిళలు, జనసైనికుల సహయ సహకారాలతో అందజేయడం జరిగింది అన్నారు. మర్రిపాడు మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్న చిన్నా జనసేన టీం ను అభినందించారు. అనంతరం చిన్నా మాట్లాడుతూ యానదయ్య కుటుంబానికి ఆర్థికసాయం అందచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రచార కార్యదర్శి ఉదయ్, మండల నాయకులు గంటా అంజి, చందు, రమేష్ పాల్గొన్నారు.