Logo
Date of Publish : 28 November 2020, 12:54 pm
Editor : Sake Naresh

జనసేన మన ఊరు- మనసేన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జనసేన నాయకులు

జనసేన మన ఊరు- మనసేన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జనసేన నాయకులు

                 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈరోజు జనసేన నాయకులు క్రాంతి శ్రీ గారు ఆధ్వర్యంలో కల్కినగర్, విజయనర్శింగ్ కాలేజ్ లో జనసేన కార్యకర్తలు, మరియు నాయకులు సమక్షంలో, మన ఊరు- మనసేన అనే కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థులు యొక్క ఆలోచనలు మరియు సమస్యలు అలాగే సమాజంలో వాళ్ళ పాత్ర అలాగే ముఖ్యమైన అనేక అంశాల్లో చర్చా వేదికలో తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన 2021 సంవత్సరం  పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిలుగా విచ్చేసిన భీమిలి నియోజకవర్గ ఇంఛార్జి Dr సందీప్ పంచకర్ల గారు, పాతపట్నం ఇంచార్జి గేదెల చైతన్య గారు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు dr విశ్వక్సేన్ గారు చేతులు మీదగా ఆవిష్కరించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యం గా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.  జనసైనికులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో చైతన్య గారు సందీప్ గారు మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని గ్రామ స్థాయిలో తీసుకొని వెళ్లి గ్రాములో ప్రధాన సమస్యలు పోరాటం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జనసేన నాయుకులు, వీర మహిళలు, జనసైనికులు,  రాజా రమేష్ గురజా శ్రీను, పొట్నూరు లక్ష్యం నాయుడు, సూర్యనారాయణ, రాజు, శివ,ఆనంద్, అప్పలకొండ, దినేష్, దుర్గారావు, బాబాజీ, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com