Logo
Date of Publish : 13 March 2026, 6:26 pm
Editor : Sake Naresh

నెల్లిమర్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు

నెల్లిమర్ల, మార్చి 13, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కూడా పాల్గొని పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో సాధకులు కీలక పాత్ర పోషిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి బాధ్యత ఎంతో ముఖ్యమని నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి జనసేన సిద్ధాంతాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శక రాజకీయాల కోసం జనసేన పార్టీ కృషి చేస్తోందన్నారు. ‘ఉద్యమి’ సభ్యత్వం నవ సమాజ నిర్మాణానికి పునాది వంటిదని తెలిపారు. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విజయనగరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ (POCs) సమావేశంలో పాల్గొని సభ్యత్వ నమోదు పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com