Logo
Date of Publish : 16 November 2023, 9:00 pm
Editor : Sake Naresh

రాప్తాడు నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

- రానున్న ఎన్నికల్లో వైసిపి గద్దెదింపడమే జనసేన - తెలుగుదేశం పార్టీల ఉమ్మడి లక్ష్యం..

- గెలుపే లక్ష్యంగా జనసేన - టిడిపి పయనం..

- ఓటరు వెరిఫికేషన్ ప్రత్యేక దృష్టి సారించాలి...

- దొంగ ఓట్లను ఎక్కించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి...

- జనసేన - టిడిపి నాయకులు కలిసి రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతాం అవినీతిని ఎండగడతాం..

- సమన్వయనంతో పని చేద్దాం... ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం...

- రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ పరిటాల సునీత, జనసేన ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ 

      రాప్తాడు ( జనస్వరం ) : రాప్తాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన జనసేన - టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల సునీత టిడిపి తరఫున అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి గద్దెదింపడమే తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఆ దిశగా కార్యకర్తలు పని చేద్దామని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా టిడిపి - జనసేన కార్యకర్తలు పని చేస్తూ ఇంటింటికి " భవిష్యత్తుకు గ్యారెంటీ " కార్యక్రమాన్ని నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో 32 వేల దొంగ ఓట్లను రాప్తాడు నియోజకవర్గంలో నమోదు చేశారని అందుకే వైసీపీ అసంబద్ధ గెలుపు పొందారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రోడ్లు అస్త్యవస్తంగా ఉన్నాయని టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ అవినీతిని ఎండగడతామన్నారు. సమన్వయనంతో పని చేద్దాం... ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దామని అందరం కలసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తీసుకునే ఏ నిర్ణయానికి అయినా తాము కట్టుబడి ఉంటాం. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీలతో కలిసి పయనిస్తుందని జనసేన ఇంచార్జ్  సాకే పవన్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పాలనకు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుంటూ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామని జనసైనికులకు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన - తెలుగుదేశం 6 మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com