Search
Close this search box.
Search
Close this search box.

రాప్తాడు నియోజకవర్గంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం

రాప్తాడు

– రానున్న ఎన్నికల్లో వైసిపి గద్దెదింపడమే జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి లక్ష్యం..

– గెలుపే లక్ష్యంగా జనసేన – టిడిపి పయనం..

– ఓటరు వెరిఫికేషన్ ప్రత్యేక దృష్టి సారించాలి…

– దొంగ ఓట్లను ఎక్కించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి…

– జనసేన – టిడిపి నాయకులు కలిసి రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతాం అవినీతిని ఎండగడతాం..

– సమన్వయనంతో పని చేద్దాం… ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం…

– రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ పరిటాల సునీత, జనసేన ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ 

      రాప్తాడు ( జనస్వరం ) : రాప్తాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన జనసేన – టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల సునీత టిడిపి తరఫున అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి గద్దెదింపడమే తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి లక్ష్యమని ఆ దిశగా కార్యకర్తలు పని చేద్దామని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా టిడిపి – జనసేన కార్యకర్తలు పని చేస్తూ ఇంటింటికి ” భవిష్యత్తుకు గ్యారెంటీ ” కార్యక్రమాన్ని నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో 32 వేల దొంగ ఓట్లను రాప్తాడు నియోజకవర్గంలో నమోదు చేశారని అందుకే వైసీపీ అసంబద్ధ గెలుపు పొందారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రోడ్లు అస్త్యవస్తంగా ఉన్నాయని టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ అవినీతిని ఎండగడతామన్నారు. సమన్వయనంతో పని చేద్దాం… ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దామని అందరం కలసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తీసుకునే ఏ నిర్ణయానికి అయినా తాము కట్టుబడి ఉంటాం. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీలతో కలిసి పయనిస్తుందని జనసేన ఇంచార్జ్  సాకే పవన్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పాలనకు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుంటూ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామని జనసైనికులకు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన – తెలుగుదేశం 6 మండల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way