Logo
Date of Publish : 05 November 2020, 2:05 pm
Editor : Sake Naresh

టెక్కలి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కు మద్దతు తెలిపిన జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కు మద్దతు తెలిపిన జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

              రెవెన్యూ డివిజినల్ కేంద్రం టెక్కలి లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల న్యాయబద్ద మైన దీక్షకు టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ జనసేన పార్టీ తరుపున తమ సంఘీభావం తెలియ జేశారు. టెక్కలి పంచాయతి పరిధిలో గల నలభై మంది పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల బకాయిజీతాలు, సస్పెండ్ అయిన పారిశుద్ధ్య కార్మికుడు నాగవంశపు రఘు పై వెంటనే సస్పెన్షన్ ఎత్తి వేసి తనను వెంటనే విధులలోకి తీసుకోవాలని కణితి కిరణ్ డిమాండ్ చేశారు. అలానే పంచాయతి పరిధిలో గల ఏడుగురు పంపు ఆపరేటర్లకు గత ఏడు నెలలుగా జీతాలు అందలేదని వారు తెలియజేసారు. పంచాయతి పరిధిలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, సేనటరీ మేస్త్రి లు, ట్యాంక్ వాచర్ లు, పార్క్ వాచర్ లకు కూడా గత నాలుగు నెలలుగా జీతాలు అండడంలేదని వారు కణితి కిరణ్ దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించిన కిరణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి త్వరలోనే ప్రభుత్వం వారి బకాయిలు చెల్లించేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జనసేన నాయకులు శేఖర్, హరి, శ్యామ్, సాయి మహంతి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com