
అరకు ( జనస్వరం ) : నియోజకవర్గ కేంద్రం పరిధిలోగల మాడగగడ పంచాయితీ పరిధిలోన గల బెంజిపుర్ గ్రామంలో క్యాన్సర్ తో లక్ష్మి బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు పరామర్శించారు. అనంతరం బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దురియా, రామకృష్ణ, అలంగి, రాజ్ భారత్ తదితరులు పాల్గొన్నారు.